![]() |
![]() |
.webp)
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లెనిన్ మూవీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చారు. "మీరు డెఫినిట్లీ కనిపించే వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి." అని చెప్పాడు హోస్ట్ సుధీర్. వెనక స్క్రీన్ మీద అఖిల్ పాకే వయసులోనే నటించిన సిసింద్రీ మూవీ నుంచి పిక్ ని వేసి చూపించాడు. "ఇక్కడున్న పిల్లలకన్నా చాలా యంగ్ ఏజ్ లోనే నటించారు " అని చెప్పాడు సుధీర్. "ఇప్పటి నుంచి చూడబోయే అఖిల్ వేరు అన్నంత స్టేజి ఉందన్నమాట జనులందరిలో " అన్నాడు సుధీర్. "లెనిన్ మూవీ నా సమాధానం ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో బాబాయ్ కూడా " అంటూ హీరో శ్రీకాంత్ ని చూపించారు. "చిన్నప్పుడు సిసింద్రితోనే ఇండస్ట్రీని షేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు " అంటూ అఖిల్ గురించి చెప్పారు అనిల్ రావిపూడి. వెంటనే అఖిల్ "వచ్చే సంక్రాంతికి మనం ఒక సినిమా తీయాలి " అని చెప్పాడు.
ఇక స్క్రీన్ మీద పెద్ది రాంచరణ్ పిక్ చూపించారు. "మై ఆర్ సి . మై హార్ట్ బీట్" అన్నాడు. తర్వాత సమంత పిక్ తో ఉన్న "మా ఇంటి బంగారం " పోస్టర్ వేశారు. "ఫిమేల్ పవర్ చూపించింది " అన్నాడు. "మాసివ్ బ్లాక్ బస్టర్ లెనిన్ " అనే పోస్టర్ వేశారు. "అఖిల్ గారే నంబర్ వన్ " అని చెప్పారు అనిల్ రావిపూడి. కాదు అని అఖిల్ తల ఊపి " ఇంట్లో ఇంకొకరు ఉన్నారు నాతో పాటు. ఆ పెయిన్ వాళ్ళు ఫీలయ్యారు. కంప్లీట్లీ నాచురల్ గా ఆ మూమెంట్ లో వచ్చేసింది " అన్నాడు. వెనక కేక్ కట్ చేసిన నాగార్జున అఖిల్ ని హగ్ చేసుకుంటున్న వీడియోని ప్లే చేశారు.
అఖిల్ అక్కినేని రీసెంట్ గా నటించిన మూవీ "లెనిన్ ". ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దూసుకుపోతోంది. అఖిల్ చేసిన మూవీస్ తక్కువే ఐనా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీస్ లో నటించాడు. 1995లో 'సిసింద్రి' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2015 లో అఖిల్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'హలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్' మూవీస్ లో నటించాడు.
![]() |
![]() |